Sports & Games

Breaking News

తలమడుగులో పెట్టచే ప్రారంభోత్సవాలు

అదిలాబాద్:తలమడుగు మండలం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొని కొమురం భీం, అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామస్తులు మేళతాళాలతో, భాజా భజంత్రీలతో జిల్లా పాలనాధికారి కి ఘనంగా స్వాగతం పలికారు. మండలం లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో  గణపతికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గణేష్ మండపం ఉత్సవ కమిటీ పూజారి పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. తదుపరి నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయాన్ని , ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగంగా  వసుందర మండల సమైఖ్య కుట్టు మిషన్ కేంద్రం ను అదనపు కలెక్టర్ శ్యామల దేవి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో RDO వినోద్ కుమార్, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపిడిఓ, సంబంధిత సిబ్బంది, మహిళా సంఘాల అధ్యక్షులు, మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.