Sports & Games

Breaking News

నూతనంగా నిర్మించిన రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.

రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా 8 లక్షల విలువ గల భవనాన్ని ప్రారంభించడం జరిగింది. డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ హైదరాబాద్ ఆదేశానుసారం సైనిక్ భవనాన్ని స్థానిక సంజయ్ నగర్ లో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించడం జరిగింది. రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ మిల్క్ సెలింగ్ సెంటర్ దగ్గర గాంధీ పార్క్ వెనకల ఉన్న ఆఫీస్ ని నేడు ప్రారంభించబడిన సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కి మార్చడానికి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సైనిక్ భవనం ప్రారంభం అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో రీజనల్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సైనిక్ వెల్ఫేర్ కార్యక్రమాలైన ఐడి కార్డు జారీ చేసే విధానం, హౌస్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, క్యాంటిన్ ఏర్పాటు కొరకు వైద్య సదుపాయాలు కల్పించుట కొరకు స్వయం ఉపాధి రుణాల కోసం లీడ్ బ్యాంకు మేనేజర్ ద్వారా పరిశ్రమల శాఖ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు మ్యారేజ్, చదువు కొరకు తదితర సంబందించిన విషయాలను చర్చించడం జరిగింది. ఆర్మీ వితంతువైన సిరికొండ కు చెందిన మహిళా ఎక్స్ సర్వీస్మెన్ శ్రీమతి వెల్కర్ పూజ కు 2 లక్షల చెక్కును కలెక్టర్ చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడా, సైనిక్ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి బి.తిరుమల, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, లీడ్ బ్యాంకు మేనేజర్, పరిశ్రమల శాఖ పర్యవేక్షకులు, మాజీ సైనిక సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, ఉప అధ్యక్షులు అశోక్, సెక్రెటరీ మోహన్, క్యాషియర్ దేవన్న, మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రవి, డిబి చారి, సత్తయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.