అతని పయనం ఆదర్శనీయం...
ఆకస్మిక మృతి చెందిన పేద మహిళ కుటుంబానికి అండగా నిలిచిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ హిందూ సాంప్రదాయం ప్రకారం కాడు కట్టి, కాడు మోసి, చితి పేర్చిన పెద్దన్నయ్య. మృతి చెందిన హిందూ స్త్రీ మూర్తికి ఏ లోటు లేకుండా అంత్యక్రియలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ అధికారి కార్యాలయం దగ్గర కంసాలి గీసిడి కుటుంబానికి చెందిన పాతిక సంవత్సరాల నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనిత అనారోగ్యం తో రిమ్స్ లో మంగళ వారం మృతి చెందింది..అంత్యక్రియలు చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులతో ఉన్న ఆ మహిళా భర్త అంకుశ్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త,బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు సమాచారం ఇవ్వడం తో ఆయన హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతేకాబ్ ఆలం సహకారం తో...హిందూ సాంప్రదాయం ప్రకారం కాడు కట్టి.. కాడు మోసి,స్థానిక పిట్టల వాడ వైకుంఠ దామంలో మహిళ పార్థివ దేహానికి ఆమె కుమారునితో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె చితికి అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త అంకుష్ నిరుపేద కుటుంబం అయిన మాకు అండగా నిలిచి జీవితంలో ఏ బంధం చేయని సహాయం చేశారని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కి, హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతేకాబ్ ఆలం లకు పాదాభివందనం చేశాడు..ధైర్యంగా ఉండాలి అని...ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మాకు తెలియజేయుమని మృతురాలి భర్త కు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇంతేకాబ్ ఆలం అభయం ఇచ్చారు...జిల్లా లో రెండు రోజుల్లో అనుకోకుండా జరిగిన మృత్యువాత కు మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలిచిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ,హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కి జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..
