ఏఎన్ఎం మృతి పట్ల సంతాపం తెలిపిన ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా
కే నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451
వరంగల్,(ఆరోగ్య జ్యోతి):యూ పి హెచ్ సి ఎస్ ఆర్ ఆర్ తోటలో ఏ ఎన్ ఎమ్ గా విధులు నిర్వహిస్తూ కరీమాబాద్ తోట సమీప ప్రజలకు ఎన్నో మెరుగైన వైద్య సేవలు అందించి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ముందుండి వైద్యసేవలు అందించి కరోనని జయించి క్యాన్సర్ మహమ్మారి తో పోరాడి నిన్న తుది శ్వాస విడిచిన అరుణ సిస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసినారు వారి కుటుంబానికి మనో దైర్యం కలిగించాలని దేవున్ని కోరుకుంటూ సిస్టర్ కు ఇద్దరు కూతుర్లు కాబట్టి వారికి ప్రభుత్వం తరుపున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు కోల్పోయిన కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, వెంటనే కుటుంబానికి 20 లక్షల ఎక్సే గ్రేసీయా ప్రకటించాలని, కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇట్టి కారక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఉపాధ్యక్షులు నూకల అంజి సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.