Sports & Games

Breaking News

ఆహారంలో మార్పులతో గుండె జబ్బులకు దూరం

ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451

-  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ 

అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): మనం తినే ఆహార మార్కులతో పాటు జీవనశైలిలో అనేక రకాల మార్పులు చేసినట్లయితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. గుండె జబ్బుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం తినే ఆహారంలో మార్పులు తీసుకొని రావాలని తెలిపారు ముఖ్యంగా బయట దొరికే తినుబండారాలు ఓటలలో ఎక్కువగా తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ప్రతిరోజు మనం యోగా వ్యాయామం ధ్యానం లాంటివి తప్పకుండా చేయాలని ఆయన సూచించారు.ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్  నీ  "వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడంవరల్డ్ హార్ట్ ఫెడరేషన్(WHF) మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) సంయుక్తంగా గుండె సంబంధిత వ్యాధులు  మరణాలను అరికట్టేందుకు గాను ప్రతి సెప్టెంబర్ 29 తేదీని "వరల్డ్ హార్ట్ డే" గా గుర్తించి ఆరోజు అనేక రకాలైనటువంటి గుండె సంబంధిత వ్యాధులు అరికట్టడానికి అవగాహన  కార్యక్రమాలను చేయవలసిందిగా 2000 సంవత్సరంలో నిర్దేశించడం జరిగిం గింది అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 18.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయని  భారతదేశంలో 4.3 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయ నీ ఆయన పేర్కొన్నారు. 2025 సంవత్సరంలోగా ఈ మరణాలను 25% తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింద నీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు మానసిక గా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని దీనివల్లనే ఎక్కువ శాతం గుండె జబ్బులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వరల్డ్ హార్ట్ డే ని పురస్కరించుకొని ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ  ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆరోగ్య సిబ్బంది అందరికీ హెల్త్ స్క్రీనింగ్  తో పాటు వరల్డ్ హెల్త్ డే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.  జిల్లావ్యాప్తంగా 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 126 ప్రాథమిక ఉప కేంద్రాల్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు మరియు సిబ్బందికి హెల్త్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బిపి తో పాటు షుగర్ పరీక్షలను సిబ్బందికి జర్నలిస్టుకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన , డిస్టిక్ లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ గజానంద్, ఎన్ హెచ్ ఎం డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్, జిల్లా ఎపిడిమాలజిస్టు డాక్టర్ అశోక్, జిల్లా గణాంకల అధికారి బ్రహ్మానందం రెడ్డి, మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.