ముందస్తు జాగ్రత్త తోనే గుండె జబ్బులు దూరం - కమిషనర్ ఆర్వి కర్ణన్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రజలకు గుండె జబ్బులు రాకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని దీనితో పాటు ఆహారంలో అనేక రకాల మార్పులు తీసుకువచ్చినప్పుడే ప్రజలకు గుండె జబ్బులు రాకుండా ఉంటాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవ సందర్భంగా కమిషనర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతోపాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29న వరల్డ్ ఆర్ట్ డే ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది శాఖ సిబ్బందికి బిపి షుగర్ టెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. గుండె జబ్బు దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం గుండె జబ్బుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 18.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనైతే 4.3 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. 2025 సంవత్సరంలోగా ఈ మరణాలను 25% తగ్గించాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి డి స్టేట్ మోడల్ ఆఫీసర్ మంజునాథ్ ఎన్సిడి స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తేజస్విని సి వి హెచ్ ఓ లు డాక్టర్ శ్రావణ్ డాక్టర్ వస్సీ తదితరులు పాల్గొన్నారు.