మహిళల రక్షణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు - చైర్ పర్సన్ నేరెళ్ల శారద
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
మహిళా కమీషన్ టోల్ ఫ్రీ నెంబర్
9490555533
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్
1098
మహిళా హెల్ప్ లైన్ నెంబర్
181
అదిలాబాద్: మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. శనివారం నాడు పెనుగంగా గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలను రక్షించే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మహిళలు అన్ని రకాల రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు హాస్టల్లో సెంట్రల్ జైలు తోపాటు అన్ని స్థలాల్లో పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. హాస్టల్లో జైల్లో ఫుడ్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సౌకర్యాలు అన్నింటిని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అంగన్వాడి సెంటర్లలో మహిళలకు పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారని ఇక నుండి ప్రతి సిడిపిఓ సూపర్వైజర్లు అన్ని సెంటర్లు తిరగాలని సూచించినట్టు ఆమె పేర్కొన్నారు.సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14567ఈ నెంబర్ల పై హోర్డింగ్ ఏర్పాటు చేయాలి.మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద.సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద.శనివారం పట్టణం లోని సఖీ కేంద్రాన్ని మహిళా కమీషన్ ఛైర్పర్సన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సఖి కేంద్రం లో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లను పరిశీలించి బాధితులకు అందిస్తున్న సేవలను, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పై ఫిర్యాదు కొరకు క్రింది టోల్ ఫ్రీ నెంబర్ లను సంప్రదించాలని , అలాగే గ్రామాల్లో, అంగన్వాడి కేంద్రం లలో, కూడళ్లలో ఈ నెంబర్ల పై హోర్డింగ్, బోర్డులను ఏర్పాటు చేయాలని ఆన్నారు.
మహిళా కమీషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9490555533
మహిళ హెల్ప్ లైన్ నంబర్-181చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ -14567సఖి కేంద్రం కి వచ్చిన బాధితులకు కౌన్సిలింగ్ , న్యాయ సలహాలు అందించి అవసరమైన వారికి 107 బాధితులకు గాను కోర్టులో గృహహింస చట్టం 2005 ప్రకారం కేసు నమోదు చేయగా అందులో ఇప్పటివరకు 15 కేసులకు గాను intereim మెయింటెనెన్స్ ఆర్డర్లు ఐదుగురికి ఫైనల్ ఆర్డర్లు రావడం జరిగిందనీ, ఎక్కువగా కేంద్రం నిర్వాహకురాలు తెలిపారు.హాస్టల్స్, కాలేజీలలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారా, అక్కడ ఏమైన సమస్యలు ఉంటే నివేదికసమర్పించాలని ఆన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ మెంబర్ ఈశ్వరి బాయి, సెక్రటరీ సుభద్ర, dwo సబిత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.