వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో సభ్యులు ముందు ఉండాలి
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్: ప్రజా సమస్యలను తెలుసుకొని చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే మనం ప్రజలకు అన్ని రకాల న్యాయం చేయగలమని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు అన్నారు. ఆదివారం నాడు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజ్జేషన్ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్జ్యూమర్ రైడ్స్ ఆర్గనైజేషన్ అనేది 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు మన సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. వినియోగదారునికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను కన్స్యూమర్ రేట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. కన్జ్యూమర్ రేట్స్ లో ఉన్న చట్టాలు పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అవసరమైతే కన్జ్యూమర్ రైట్స్ చట్టాలపై సభ్యులందరికీ అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సభ్యులు ఉన్న వారందరూ ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే ఆ ఫిర్యాదుని పరిశీలించిన మీదట సభ్యులందరు వెళ్లి సమస్యను పరిష్కరించాలని తెలిపారు లేనిపక్షంలో కోర్టులో కేసు వేసినట్లయితే వినియోగదారునికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తూనికలు కొలతలు తినుబండరాలు హోటల్లో మందులు తోపాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని తెలిపారు అన్నింటిపై మనకు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం వినియోగదారునికి న్యాయం చేయగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతరం కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ లో పలువురు సభ్యులు చేరారు వారందరికీ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జి శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రాజు యాదవ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు దోమతి కిరణ్ కుమార్ జిల్లా జెంట్ సెక్రెటరీ షేక్ ఇర్ఫాన్ తో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉమెన్ ఇన్చార్జ్ తన్నీరు హేమావతి తదితరులు పాల్గొన్నారు.