రెండవ ఏఎన్ఎం లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి
. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
*2వ ANM లను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి*
*AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్*
ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి):NHM స్కీంలో పనిచేస్తున్న 2వ ANMలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రోజున కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా 2వ ANM యూనియన్(AITUC) జిల్లా అధ్యక్షులు టి దివాకర్ అధ్యక్షతన ఆసిఫాబాద్ స్కూల్లో జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ సుమారుగా గత 20 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో రెండవ ఏఎన్ఎంలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.ముఖ్యంగా కరోనా సమయంలో రెడ్ జోన్లలోకి వెళ్లి పని చేశారని గుర్తు చేశారు.కరోనా సమయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వీళ్ళ సేవలను గుర్తించడం లేదని అన్నారు.గత సంవత్సర కాలం క్రితం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండవ ANMలను రెగ్యులర్ చేయాలని డిమాండ్తో సమ్మె చేయడం జరిగిందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్కు ఓటు వేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరిని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.నేటికీ 9 నెలలు అవుతున్న ఒక్క ANM ని కూడా రెగ్యులర్ చేయలేదని అన్నారు.అలాగే వీరికి పెండింగ్లో ఉన్న పి.ఆర్.సి బకాయిలను వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ , 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఇవ్వాలని డిమాండ్ చేశారు,100శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినపూర్తి కాలానికి వారికి గ్రాట్యుటీ చెల్లించాలని, ఐదు వేల పైన పాపులేషన్ ఉన్నవారికి రెండవ ఏ నిమిషం ను అదనంగా కేటాయించాలని, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా రెండవ లకు కూడా సెలవులు మంజూరు చేయాలి పెనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, సాయంత్రం 6:00 తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదని అన్నారు సంవత్సరానికి రూ.5000/-ఇవ్వాలని అన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేస్తామని అన్నారు ఈ సమావేశంలో AITUC జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్,ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి,రెండవ ANM యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి,ప్రధాన కార్యదర్శి పుణ్యవతి,కోశాధికారి సునీత నాయకురాలు వసంత, గోదావరి,శైలజ,లక్ష్మి,లలిత,భాగ్,స్వరూప,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.