డెడ్రా మల్కాపూర్ గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
- గ్రామంలో బాల వికాస్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
- గిరిజన గుట్ట డేడ్రా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్
- ఈసారి తారు రోడ్డుపై కష్టంతో వచ్చాను - మళ్ళీ బీటీ రోడ్డుపై వస్తానని హామీ
- మిషన్ భగీరత నీరు వచ్చాకే కంటి నిండా నిద్రపోతున్నాం - గిరిజన డేడ్రా, మాన్కపూర్, ఉమర్డ గ్రామస్తులు
బజార్ హత్నూర్ మండలంలోని ఉమర్డ, డేడ్రా మరియు మాన్కాపూర్ గ్రామాలలోబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఉమర్డ, డేడ్రా గ్రామంలో మంజూరు అయిన బాల వికాస్ మినరల్ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించారు. అనంతరం మాన్కపూర్ గ్రామానికి వాగులు దాటుతూ చేరుకొని గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కష్టాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భూతాయి నుంచి డేడ్రా 1 కోటి 75 లక్షలు మరియు డేడ్రా నుంచి మాన్కపూర్ వరకు 1 కోటి 55 లక్షలు మరియు భూతాయి కె నుంచి ఉమర్డ వరకు 3 కోట్ల 77 లక్షలు మరియు భూతాయి కె నుంచి గిరిజాయ్ వరకు 1 కోటి 10 లక్షలతో బీటీ రోడ్లు మంజూరు చేశారని వాటిని ఈ దసర తర్వాత కచ్చితంగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.