సరైన ఆహారంతోనే గుండె జబ్బులు దూరం
.నేడు ప్రపంచ హృదయ దినోత్సవం...
*హృదయ దినోత్సవం, అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకుంటారు..*
ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది మరణిస్తున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, గుండెపోటు ఉన్న 50 శాతం మంది భారతీయ పురుషులు 50 ఏండ్లలోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్లలోపు వారు. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ ప్రకారం, గుండె జబ్బుల కారణంగా 57 శాతం మరణాలు 25-69 సంవత్సరాల మధ్య ఉన్న గుండె రోగాల వల్ల జరుగుతున్నాయి. 1990 లో దేశంలో గుండె రోగుల సంఖ్య కేవలం 2.57 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 54 కోట్లకు పైగా పెరిగింది. భారతదేశంలో వివిధ వ్యాధుల కారణంగా మరణించినవారిలో 28.1 శాతం మరణాలు గుండె జబ్బుల కారణంగా జరుగుతున్నాయి.మనం తీసుకునే ఆహారం, రక్తపోటు, వాయు కాలుష్యం, హై కొలెస్ట్రాల్, సిగరెట్ స్మోకింగ్, ఊబకాయం కారణంగా గుండె జబ్బులు వస్తున్నందున వీటిపై దృష్టి సారించడం ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు గంట పాటు నడక, 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు శుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవాలి...