ఉచిత వైద్య శిబిరం,వ్యాధులపై అవగాహన
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఇంద్రవెల్లి,(ఆరోగ్యజ్యోతి): ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాద్గోమ్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య కార్యకర్త కె విజయ సుందరి, శివరంజని, అంగన్వాడీ కార్యకర్త ఎన్ లక్ష్మి, సూపర్వైజర్ కౌసల్య, ఆశ కార్యకర్త సునీతతో పాటు తదితరులు పాల్గొన్నారు.ఈ శిబిరంలో ఇమ్యునైజేషన్ తోపాటు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందజేశారు పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని ఆరోగ్య కార్యకర్త విజయ సుందరి తెలిపారు. ప్రతి చిన్నారులకు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని తెలిపారు గర్భవతి అని తెలిసిన వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు క్రమం తప్పకుండా ప్రతి నెల నెల వాయిదా పరీక్షలు చేయించుకోవాలని ప్రసూతి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని తెలిపారు. వర్షాకాలం వ్యాధులపై అవగాహన కల్పించారు.