Sports & Games

Breaking News

వైద్యులంతా ఎన్ఎంఆర్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి -ఎన్ఎంసీ

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): దేశంలో వైద్య సేవలందించాలనుకునే ప్రతి ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడు తప్పనిసరిగా నేషనల్ మెడి కల్ రిజిస్టర్ (ఎన్ఎంఆర్)లో రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని జాతీయ వైద్య మండలి స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క వైద్యుడికి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎన్ఎన్ఆర్ను ఎథిక్స్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు పర్యవేక్షిస్తుం దని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని పేర్కొంది. వైద్యుడి పేరు, చిరునామా, విద్యార్హతలన్నీ ఇందులో పొందుప రుస్తామని వెల్లడించింది. దేశంలోని అల్లోపతిక్ (ఎంబీబీఎస్) వైద్యులం దరి సమాచారం ఇందులో ఉంటుందని తెలిపింది. ఆన్లైన్లో ఎన్ఎంఆ ర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వైద్యులకు సూచించింది.