Sports & Games

Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్, 9848025451

వేములకొండ, (ఆరోగ్య జ్యోతి): వర్షాకాలం సీజన్లో వచ్చేవేళపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం మన అందరిపై ఉండని జిల్లా అదనపు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎం మనోహర్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కే రామకృష్ణాలు అన్నారు. వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ఫార్మసీ వ్యాక్సిన్ స్టోరేజ్ ను పరిశీలించారు రికార్డులు అన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి చికిత్సలు అందించాలని తెలిపారు నెల నెల క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి అయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఆరోగ్య పథకాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అంతేకాకుండా అన్ని రకాల పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరూర్ మరియు వెల్వర్తి సందర్శించారు పనితరం బాగుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రసిద్ధి, డాక్టర్ ఉదయ్, కిరణ్ డాక్టర్, అనూష, అనురాధ, రమేష్, ప్రవీణ్, మరియమ్మ, రేణుక, జానకి రాములు తోపాటు మెడికల్ పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.