పాఠశాల పిల్లలకు వైద్య పరీక్షలు
ఎడిటర్ కె నరేష్ కుమార్, 9848025452
తాంసి,కప్పర్ల,(ఆరోగ్యజ్యోతి): తాంసి మండలంలోని కప్పర్ల లోని ఎస్ డబ్ల్యూ బి హెచ్ లో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం ఆర్ బి ఎస్ కె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సుజాత, డాక్టర్ నరేందర్ తోపాటు ఫార్మసిస్ట్ విజయలక్ష్మి రవీందర్ లో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య చికిత్సలు అందించడంతోపాటు శానిటేషన్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తినే సమయంలో తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని తెలిపారు. పరిశుభ్రత వల్లనే వ్యాధులు దూరమవుతాయని వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చ కామెర్లు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అతిసారా తోపాటు అనేక రకాల జబ్బులు వస్తాయని తెలిపారు. ఇవి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పేర్కొన్నారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి కాలువల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు నీటి నిల్వలు ఉండకుండా చూడాలని తెలిపారు.