Sports & Games

Breaking News

పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్..9848025451

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజు రిమ్స్ ప్రసూతి వార్డ్ వద్ద ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వ్యాధి నిరోధక టీకాలను అన్నిటిని పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పిల్లలకు సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ వైద్య కళాశాల అనుబంధంగా ఉన్న ఆసుపత్రి కావడం వల్ల పిల్లలందరికీ క్రమం తప్పకుండా వ్యాధినిరోకటికాలు ఇవ్వాలని తెలిపారు అంతేకాకుండా వారికి వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డ్రీమ్స్ లో వ్యాధి మీద ఒక్క టీకాలు ఇచ్చిన అనంతరం వారికి కార్డు అందజేయాలని మళ్ళీ వారి కిస్సా సంబంధించిన గ్రామంలో బుధవారం శనివారం ఆరోగ్య కార్యకర్త వద్ద వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని తల్లిదండ్రులకు తెలుపాలని సిబ్బందికి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ సాయి ప్రీతి, సచిన్, సూపర్వైజర్ సుగుణ, ఆరోగ్య కార్యకర్తలు శశికళ ప్రియదర్శిని, హేమలత తదితరులు ఉన్నారు.