రిమ్స్ ఆస్పత్రిలో త్వరలో ప్లేట్లెట్స్ సేవలు - రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
• త్వరలో అందుబాటులోకి మిషన్
• రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్
ఆదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరం రావడంతో రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం దీంతో రోగి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడంతో రోగికి వెంటనే ఇబ్బందులు పడేవారు అయితే అదిలాబాద్ రూమ్స్ లోనే త్వరలో ప్లేట్లెట్స్ అందుబాటులోకి వస్తున్నట్లు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ మరియు సూపర్డెంట్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే రోగికి రిమ్స్ ఆస్పత్రిలోని ప్లేట్లెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా
జిల్లాలో డెంగీ తో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (ఎస్ఈపీ)సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది వరకే ఈ మిషన్ రిమ్స్ ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన అనుమతులు రాలేదు. టెక్నీషియన్లు లేకపోవడంతో తెచ్చిన మిషన్ ను సైతం ఇన్స్టలేషన్ చేయలేకపోయారు. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో దాని సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టి నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. రిమ్స్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ మిషన్ ఉన్నప్పటికీ ప్లేట్లేట్స్ సంఖ్య తక్కువగా పెరుగుతోంది. దీంతో బాధితులు కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్తో ఒక్కసారి 10వేల నుంచి 50వేల వరకు పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే రోగిలో 20వేల నుం చి 30వేలకు ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు శరీరంపై దద్దుర్లు, చిగుర్ల నుంచి రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ను ఎక్కిస్తారు. ఇది వరకు నిర్మల్, నిజామాబాద్ వంటి ఇతర ప్రాం తాల నుంచి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ను తీసుకువచ్చి రోగికి ఎక్కిచ్చేవారు. ఒక్కో బ్యాగు ఖరీదు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ఉండేది. దీంతో దాన్ని కొనుగోలు చేయడం, రవాణా పరంగా తీవ్ర వ్యయ, ప్రయాసాలకు గుర వ్వాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రిమ్స్ ఈ ఎస్ఓపీ సేవలు అందుబాటు లోకి రానుండటంతో డెంగీ బాధితులకు ఊరట లభించనుంది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే రోగులకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కూడా రోగులు కోలుకుంటారు.