317 జీవో నష్టపోయిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు న్యాయం చేస్తాం - ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ కు వైద్య ఉద్యోగుల వినతి
- ఉద్యోగులకు న్యాయం చేయండి
- 317 బాధిత ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు రాపోలు శేఖర్ ఆధ్వర్యంలో వినతి పత్రం
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న 317 జీవో బాధిత ఉద్యోగులను బదిలీ చేయాలని తెలంగాణ 317 బాధిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాపోలు శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మరియు ప్రొఫెసర్ కోదండరాం వినతి పత్రాన్ని సమర్పించారు.317 జీవో ప్రకారం స్థానికత కోల్పోయిన ఉద్యోగులందరూ ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మరియు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 317 జీవో వల్ల చాలామంది ఉద్యోగులు నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ జీవో వల్ల కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని భార్య ఒకచోట భర్త మరొకచోట పిల్లలు ఇంకొక చోట ఉండవలసిన పరిస్థితి ఈ జీవో వల్ల జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును పరిశీలించి త్వరలో స్థానికత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు ఇందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో 317 జీవోకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. వీలైనంత తొందరలో 317 జీవో బాధితుల ను స్థానికత ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతరం 317 జీవో వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అధ్యక్షులు రాపోలు శేఖర్ ఎమ్మెల్సీ మరియు ప్రొఫెసర్ కోదండ రాముకు వినతిపత్రం సమర్పించారు 317 జీవో వల్ల స్థానికత కోల్పోయామని వైద్య ఉద్యోగులందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. వీలైనంత తొందరలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న 317 జీవో బాధితులను బదిలీలు చేయాలని ఆయన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం దృష్టికి తీసుకువెళ్లారు. కమిటీ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి కి 317 జీవో బాధితులు వినతిపత్రాన్ని ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఉద్యోగులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విషయమై హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి కూడా గతంలో తీసుకు వెళ్లడం జరిగిందని రాపోలు శేఖర్ తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న 317 జీవో బాధితులకు ప్రభుత్వ న్యాయం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు రాపోలు శేఖర్ ఆరోగ్య జ్యోతి తో తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు317 G. O. వైద్య ఆరోగ్య బాధితుల రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు శేఖర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, రాష్ట్ర ట్రెజర్స్ రాథోడ్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండెగుజ్జుల సోమేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలూరి మంజుల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమావత్ రవి నాయక్, రేష్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇందిరా కరిసె స్రేట్ వైస్ ప్రెసిడెంట్ మంజుల ఆలూరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. హరిశంకర్, రాష్ట్ర ఎథికల్ అడ్వైజర్ భాగ్యలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు విజయశ్రీ, చంద్రశేఖర్ టి సుజాత, సందీప్ స్టేట్ టెక్నికల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.