Sports & Games

Breaking News

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

-  డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. వెంకటరమణ 

 వరంగల్,(ఆరోగ్య జ్యోతి); జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ కరీమాబాద్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని మరియు ఖిలా వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని ఇంటిని సందర్శించి పలు సూచనలు చేశారు.ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున కరీమాబాద్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న పునరావాసితులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి మందులను పంపిణీ చేశారు.  వైద్య సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇంటింటి జ్వర సర్వే చేపట్టి మందులు పంపిణీ చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన  కల్పించాలని తెలిపారు.అదేవిధంగా మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంటీ లార్వెల్ ఆపరేషన్ మరియు పైరిత్రం స్ప్రే ను పరిశీలించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, సాయంత్రం  ఫాగింగ్, చేయించాలని సూచించారు. ప్రజలు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు భుజించకుండా పరిశుభ్రమైన వేడి ఆహారాన్ని తీసుకోవాలని మరియు కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  రవి , ఎస్.ఆర్.ఆర్.తోట  మెడికల్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జ్ ఏ ఎం ఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్ విజయేంద్ర కుమార్, సూపర్వైజర్ సదానందం , ల్యాబ్ టెక్నీషియన్ మౌనిక, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.