షాద్నగర్ లోని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో వైద్య శిబిరం
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
రంగారెడ్డి,(ఆరోగ్య జ్యోతి): జిల్లా వైద్యాధికారి బి వెంకటేశ్వరరావు ఆదేశానుసారము షాద్నగర్ డివిజన్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏరియాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టలల్లో మెడికల్ క్యాంపులను నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, విద్యార్థులకు చికిత్సలు అందించి మందులను అందజేశారు.
షాద్నగర్, ఫరూక్ నగర్ లోని ఎస్ టి బాలుర హాస్టల్లో డాక్టర్ నాగేందర్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బాలుర హాస్టల్లో ఉన్న మొత్తం బాలురు 100 మంది పరీక్షించి , అందులో నలుగురి బాలురలకు జ్వరము, ఎనిమిది మంది బాలురకు కోల్డ్ , ఒక అబ్బాయికి గాయముకు సంబంధించిన మందులను అందజేయడం జరిగింది అని జె శ్రీనివాసులు తెలిపినారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.
మధ్యాహ్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడ్ ఏరియా, సబ్ సెంటర్ "బి" రాఘవేంద్ర కాలనీలోని *ఎస్సీ బాలికల వసతి* *గృహములో* ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మొత్తం 211 మంది ఉన్నారు, అందులో అస్వస్థకు గురైన వారిని గుర్తించి పరీక్షించి , ఇద్దరికి (2) జ్వరముకు సంబందించిన మందులు, ఐదుగురికి (5) జలుబుకు సంబంధించిన మందులు, 12 మంది విద్యార్థులకు జనరల్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అని హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, మలేరియా, ఫైలేరియా, డెంగు, చికెనుగనియా వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తూ, ఈ వ్యాధులు వివిధ రకాల దోమల వల్ల వస్తాయని తెలియజేస్తూ, దోమలు పుట్టకుండా, కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియచేశారు. మరియు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ గురించి హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలియజేశారు. తదుపరి డాక్టర్ జగదీశ్వర్ , జై శ్రీనివాసులు హాస్టల్ యొక్క వంటగదిని పరిశీలించి, వంట మనసులకు పరిశుభ్రత గురించి తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ జగదీశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎస్టి హాస్టల్ వార్డెన్ రాజు, ఎస్ సి హాస్టల్ వార్డెన్ సులోచన , ఏఎన్ఎంలు లక్ష్మి, మంజుల , స్వప్న, మరియు ఆశాలు పాల్గొన్నారు.