ముఖ్యమంత్రి దృష్టికి సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెలంగాణలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ సెకండ్ ఏఎన్ఎంల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వివరించడం జరిగిందని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలో ను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని సంఘ నాయకులు ముఖ్యమంత్రి కి వివరించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారని వారిని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. పని భారం ఎక్కువ అవుతుందని రోజు రోజుకు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని పని భారం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ముఖ్యమంత్రికి నాయకులు వివరించారు. ప్రభుత్వం సెకండ్ ఏ ఎన్ ఎం ల తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా పేర్కొన్నారు.