Sports & Games

Breaking News

కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా కమిషన్ చైర్మన్

అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాల, జూనియర్ బాలికల కళాశాల తనిఖీ --------------------------------------------------------------------------------------------------------------------- గిరిజనుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తో కలిసి నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం యొక్క విశిష్టత, నాగోబా జాతర విశేషాలను, గిరిజన సంప్రదాయాలను బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అనంతరం కేస్లాపూర్ లోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను, జూనియర్ బాలికల కళాశాలను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ కు, సిబ్బందికి సూచించారు. విద్యార్థులు చదువులో ముందంజలో ఉండి జీవితంలో ఉన్నతంగా రాణించాలని కోరారు. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని, తక్షణమే సమస్య పరిష్కారమయ్యేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో st సెల్ చైర్మన్ సేద్మకి ఆనంద్ రావు, మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, నలిమేలా నవీన్ రెడ్డి, నాగరాజ్, కృష్ణ రెడ్డి సునీల్ జాదవ్, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు