Sports & Games

Breaking News

సమస్యల పై ఫిర్యాదు కొరకు మహిళా కమీషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9490555533 కి కాల్ చేయవచ్చు

మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నేరేళ్ళ శారద తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద జిల్లా పాలనాధికారి రాజర్షి షా తో కలసి స్థానిక TTDC లో 7 వ రాష్ట్రీయ పోషణ మహ్ 2024 భారత పోషకాహారం , శ్రేయస్సును మెరుగు పరచడం పై దృష్టి సారించే కార్యక్రమం లో రక్తహీనత నివారణ, వృద్ధి పర్యవేక్షణ, కాంప్లమెంటరీ ఫీడింగ్, మెరుగైన పాలన కోసం , సాంకేతికత పై మహిళా శిశు సంక్షేమ శాఖ cdpo, సూపర్వైజర్ లు, అంగన్వాడి టీచర్ లు, సంబంధిత అధికారులతో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సెప్టెంబరు ' పోషన్ మాహ్ 2024' సందర్భంగా పోషకాహార అవగాహనను ప్రోత్సహించడానికి , ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, యుక్తవయస్సులో ఉన్న బాలికలు, ఆరేళ్ల లోపు పిల్లల పోషకాహార స్థితిపై దృష్టి సారించడం ద్వారా పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి పరిష్కరించడానికి రాష్ట్రీయ పోషణ్ అభియాన్'ను ప్రారంభించడం జరిగిందనీ ఈ సంవత్సరం 7 వ దశలో, పోషణ్ మాహ్ ప్రచారం రక్తహీనత నివారణ, వృద్ధి పర్యవేక్షణ, సుపరిపాలన , సాంకేతికత ద్వారా సమర్థవంతమైన సేవా డెలివరీ, “పోషన్ భీ పధై భీ” అనుబంధ పోషకాహారం వంటి క్లిష్టమైన అంశాలపై దృష్టి సారిస్తోందనీ ఆన్నారు. యుక్తవయస్సులో ఉన్న బాలికలకు ప్రతీ విషయం లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలు, గుడ్ టచ్ బ్యాడ్ టాచ్, తదితర వాటి పై అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు అంగన్వాడి కేంద్రాల ద్వారా ఇస్తున్న పౌష్టికాహారం గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకునేలా చూసి రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాలని ఆన్నారు.అంగన్వాడి టీచర్లు గ్రామాల్లోనే ఉంటారు కనుక గ్రామాల్లో అన్నిరకాల పరిస్థితుల పై పూర్తి అవగాహన ఉంటుందని, అంగన్వాడి టీచర్లు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.ప్రతీ అంగన్వాడి కేంద్రం లో మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9490555533 ను ఏర్పాటు చేయాలని ఆన్నారు. మహిళా కమీషన్ నెంబర్ ప్రతీ గ్రామం లో ఏర్పాటు చేయాలని ఆన్నారు.అంతకుముందు పోషకాలతో చేసిన వంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ మెంబర్ ఈశ్వరి బాయి, సెక్రటరీ సుభద్ర, dwo సబితా, pd మేప్మ మమత, డిప్యూటీ ceo కలంద, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, acdpo మిల్కా, తదితరులు పాల్గొన్నారు.