Sports & Games

Breaking News

సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులైన డ్రైవర్లకు క్లీనర్లకు లాభాల్లో వాటా రూ.5000/- ఇవ్వాలి

AITUC బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ సింగరేణి సంస్థలలో పని చేస్తున్న కోల్ ట్రాన్స్ పోర్ట్(బొగ్గు రవాణా) కార్మికులైన డ్రైవర్లు,క్లీనర్లతోపాటు అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా లాభాల్లో వాటా రూ.5000/- చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున యూనియన్ అధ్యక్షుడు అరికిల్ల స్వామి అధ్యక్షతన AITUC ఆధ్వర్యంలో ధర్నా అనంతరం బెల్లంపల్లి ఏరియా SO to GM రాజమల్లు గారికి AITUC ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది .సందర్భంగా ఏఐటియుసి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుంచి సింగరేణి సంస్థలో చాలీచాలని వేతనాలు చూసుకుంటూ, శ్రమ దోపిడికి గురవుతూ బొగ్గును రవాణా చేస్తూ సింగరేణి సంస్థకు వేల కోట్లు లాభాలు రావడంలోనూ,సంస్థ అభివృద్ధి కేంద్రంలోనూ కోల్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్లు& క్లీనర్లు) కార్మికులతో పాటు అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు, కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో కాంట్రాక్టు కార్మికుడు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం ప్రకటించిన రూ.5000/-లు లాభాల వాటను అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు, సింగరేణిలో పనిచేస్తున్న కూల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని అలాగే ప్రతి నెల 15వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని ఒప్పందం జరిగినప్పటికీ ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం వారు చెల్లించడం లేదని అన్నారు,అలాగే కార్మికులందరికీ ESI, PF,బోనస్ సౌకర్యం,ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ AITUC బ్రాంచ్ అధ్యక్షుడు అరకిల్ల స్వామి,కార్యదర్శి బి లక్ష్మీనారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి,కోశాధికారి సతీష్,కార్మికులు రాజుకుమార్, రమేష్, శ్యామ్ రావు,చంద్రకాంత్, రమేష్,శ్రీనివాస్, గోపాల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు