ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
ట్యాంక్ బంక్ ముందర కచ్చితంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు చేనేత దుస్తుల పంపిణి
ు బోథ్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ముందుగా వారి విగ్రహనికిబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నివాళులర్పించి అనంతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరయిన ఎమ్మెల్యే కి పద్మశాలి సభ్యులు శాలువతో సన్మానించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సభలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ు నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖులని, 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాదిగా ప్రత్యేక తెలంగాణ కోసం 1969 లో మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని తెలిపారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన వారై ఉండటం మన అదృష్టం అని అన్నారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.



