బీసీ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
బీసీల సత్య గ్రహ దీక్షను విజయవంతం చేయండి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు బీసీ కులాల ఐక్యవేదిక, బీసీ జనసభ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీల సత్యాగ్రహ దీక్షను బీసీ కులస్తులందరూ విజయవంతం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకులు కాశ వేణి నారాయణ యాదవ్ అన్నారు.. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ నిర్వహించే బీసీ సత్య గ్రహ దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ దీక్షకు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ రానున్నట్లు ఆయన తెలిపారు.. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు మంగదుడ్ల శ్రీనివాస్ యాదవ్, రవికాంత్, మహేందర్, పోలోజి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.