Sports & Games

Breaking News

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

.తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నియమితులై తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన శ్రీమతి నేరెళ్ల శారద ని, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.  జిల్లా కేంద్రంలోని పెన్ గంగా అతిధి గృహంలో బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ , కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ మేరకు మహిళల హక్కులు, భద్రత మరియు సంక్షేమం వంటి పలు ప్రధాన అంశాలపై చర్చించి, భవిష్యత్తులో మహిళా సమస్యల పరిష్కారానికి మరింత సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో దేవదాస్ చారి,నవీన్ రెడ్డి, సుధాకర్ గౌడ్,మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్,ఇమామ్,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు వేముల,రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.