ములుగు జిల్లాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్
ములుగు,(ఆరోగ్య జ్యోతి): జిల్లాకు ఆమోదించబడిన సెంట్రల్ డ్రగ్ స్టోర్ ( ఔషధ నిలువల గిడ్డంగి) సి. డి ఎస్. ఏర్పాటు చేయడానికి జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్వర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య లు కలసి సమావేశం ఏర్పాటు చేసి ఔషధ నిలువల గురించి వివిధఅంశాలపై చర్చించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేయడం వల్ల ఔషధపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది జిల్లాకు అవసరమని వారు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కావడం వల్ల అక్కడి నుంచి ఔషధాలు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం ములుగు జిల్లాకు సెంట్రల్ డ్రగ్స్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్వర్ తో పాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్, మెడికల్ కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ , డాక్టర్ ప్రకాష్ , డాక్టర్ నజర్ జానీ , డాక్టర్ పాల్ మరియు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు మరియు డాక్టర్లు పాల్గొని సీరియస్ స్టోర్ ఎక్కడ ఏర్పాటు చేయడం అనే దాని గురించి సమాలోచన చేసినరు.