తెలంగాణ తెగువను జాతికి చాటిన వీర మహిళ ఐలమ్మ
ఐలమ్మ అడుగుజాడల్లో నడుద్దాం..
- ఐలమ్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
అదిలాబాద్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐలమ్మ గారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని వారి ఆశయసాధనకు ప్రతీ ఒక్కరం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో, యువజన జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నాగేష్, st సెల్ చైర్మన్ సేద్మకి ఆనంద్ రావు,మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, సురేష్, నలిమేల నవీన్ రెడ్డి, రహీం ఖాన్, నాగరాజు, గౌతమ్,కృష్ణ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.