దోమల నివారణ కోసం ఆయిల్ బాల్ పద్ధతి
..*🦟దోమల నివారణకు & మరియు దోమలు పుట్టకుండా ఆయిల్ బాల్ తో నివారణ పద్ధతి
🦟 ముందుగా ఒక కాటన్ బట్టలను తీసుకుని అందులో రంపపుపొట్టు వేసి మూటలుగా కట్టి బంతులు లాగా తయారు చేయాలి.
ఒక బకెట్ లో కాలిన ఇంజన్న్ ఆయిల్ తీసుకుని ముందగా
తయారు చేసిన ఆయిల్ బాల్ లను అందులో వేసి 12 గంటలు నాన బెట్టాలి.
మంచిగా నానిన ఈ ఆయిల్ బాల్ లను నీరు నిలిచిన మురికి గుంతలు, నీరునిలిచిన డ్రెయినేజీ కాలువలు, పాడుబడిన బావుల్లో వెయ్యాలి.
ఇలా చేయడం వల్ల ఆయిల్ నీటిపై తెట్టులాగా ఏర్పడి దోమలు వాలకుండా మరియు దోమల లార్వా లు ఊపిరి అందక నిర్మూలించబడతాయి.
ఇది ఎవరికి వారు తమ తమ ప్రాంతంలో విధిగా పాటించటం వలన దోమలు పుట్టకుండా చేయగలం.
🦟 ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం దోమల వ్యాప్తి ని అరికడదాం! 🦟
🦟🦟🦟🦟🦟🦟🦟
ప్రజలను చైతన్య పరిచేందుకు....
మీ,
*మహ్మద్ కలీముల్లా ఆరోగ్య కార్యకర్త (మగ)*
పట్టణ మలేరియా పథకం నల్లగొండ.
సెల్. *9440363705*