ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసిస్ట్ దినోత్సవం
ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ(IPA) ఆధ్వర్యంలో *వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మాత్యులు **శ్రీ దామోదర రాజనర్సింహ అద్వర్యంలో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు ఇటీవల ఫార్మసిస్ట్ పోస్టుల కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలో వైద్యుల పోస్టులను కూడా భర్తీ చేశామని పేర్కొన్నారు ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్ చట్టం 1948 (ఔషధ మరియు సౌందర్య సాధనాలు) అమలు చేయలని, ప్రతి ఫార్మసీ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండెలా చర్యలు తీసుకుoటారని IPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ తేజావత్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా , డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ II పోస్ట్ లను బర్తి చేసినందుకు ఆరోగ్య మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు , తేలిపారు.ఈ కార్యక్రమంలో ( IPA TG) *రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ శివ కుమార్ తేజావత్,* ఉపాద్యక్షులు యమ్ ఎ అలీం , డాక్టర్ జ్యోతి శ్రీ, ప్రధాన కార్యదర్శి మౌర్య ఆదర్శ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంబాబు, తిరుమలరావు, సుమన్, ప్రశాంత్, మరియూ వివిధ జిల్లా అద్యక్షులు శ్రీనివాస్, సురేష్, నర్సింహ, రాంబాబు, కృష్ణ సంతోషం తదితరులు పాల్గొన్నారు.