Sports & Games

Breaking News

అదిలాబాద్ రిమ్స్ లోఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో 108 మంది ఉత్తీర్ణత

అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి):ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో 108 మంది ఉత్తీర్ణతఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆదిలాబాద్ లోని రిమ్స్ నుంచి గత ఆగస్టులో మొదటి సంవత్సరం పరీక్షలలో మొత్తం 121 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 108 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 49 మంది మొదటి శ్రేణిలో, ఇద్దరు డిస్టింక్షన్ లో, మరో 57 మంది రెండో శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను డైరెక్టర్ జైసింగ్ అభినందించారు..