నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్ హెచ్ ఎం అధ్యక్షులు ఎం.నరసింహ డిమాండ్*
- జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం)లో గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుచున్న నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం. నరసింహ డిమాండ్ చేశారు. నేడు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్స్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షురాలు కొట్టల నిశాంతిని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎం. నరసింహ మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ పద్దతిన నియమించుకునే సందర్భంలోనే వీరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారితంగా సెలక్షన్ చేయటం జరిగిందని, కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం పేద ప్రజలకు అండదండగా ఉండి వారి సేవలను అందించి వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టినటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంట్రాక్టు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలి అని ఉన్నప్పటికీ వీరికి అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని చట్ట ప్రకారం వీరికి జీతం నెలకు రూపాయలు 36750/- ఇవ్వాల్సి ఉండగా కేవలం రూపాయలు 29,900/- మాత్రమే చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదని వారు విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇప్పటికీ 10 నెలలు అవుతుంది కావున నర్సింగ్ ఆఫీసర్లను న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్లకు వెయిటేజీ 30 మార్కులు ఇచ్చి, 70 మార్కులతో ఎగ్జామ్ నిర్వహించాలని, తద్వారా వీరి సేవలకు గుర్తింపు లభించి వీరు అందరినీ పర్మనెంట్ అయ్యేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లను విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు తెలియజేశారు. నర్సింగ్ ఆఫీసర్లు అధిక పనిభారంతో సతమతమవుతున్నారని అన్ని స్థాయిల్లో సరిపడా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్లను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి, బేసిక్ వేతనం అమలు పరచాలి , వెయిటేజ్ మార్కులు పెంపుకు శ్రీకారం చుట్టాలి ప్రభుత్వనీ నర్సింగ్ ఆఫీసర్లకు న్యాయం చేయాలని సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎస్ బాలసుబ్రమణ్యం, రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ రాష్ట్ర ప్రెసిడెంట్ కొట్టల నీశ్రాంతిని , రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీత, రాష్ట్ర నాయకులు జలీల్హా, డి.సంధ్య, టీ.శ్వేత ,స్రోవంతి,కె.కవిత,జీ.స్రవంతి,సుజాత,సంగీత,డి. జ్యోతి,సావిత్రి మరియు తదితరులు పాల్గొన్నారు..