Sports & Games

Breaking News

జువినైల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*జువినైల్ వెల్ఫేర్ కరక్షన్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ లో మెడికల్ క్యాంపు నిర్వహించిన యు.ఎఫ్. డబ్ల్యూ.సి. ఎం.జి.ఎం. హాస్పిటల్ డాక్టర్.ఎం. యశస్విని.*

వరంగల్,(ఆరోగ్య జ్యోతి):అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్) వారి ఆధ్వర్యంలో వరంగల్ ఆటోనగర్ లోని జువెనైల్ వెల్ఫేర్ కరెక్షన్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ లో మెడికల్ క్యాంపు నిర్వహించి  వారికి మందులు పంపిణీ చేసిన డాక్టర్.ఎం.యశస్విని. ఈ సందర్భంగా ఎం.జీ.ఎం. హాస్పిటల్ యు ఎఫ్ డబ్ల్యూ సి  మెడికల్ ఆఫీసర్ డాక్టర్.ఎం. యశస్విని విద్యార్థులందరికి మెడికల్ చెకప్  చేశారు.  ఈ సందర్భంగా డాక్టర్ యశస్విని మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి,  వేడి ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా  గుడ్లు, పాలు మరియు బ్రెడ్ మొదలైనవి తీసుకుంటే ఆరోగ్యం హాయిగా ఉంటుందని స్టూడెంట్స్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో  సూపర్డెంట్ శ్రీదేవి, ఎం.జి.ఎం.హాస్పిటల్ హెచ్.వీ.నర్సమ్మ, రామ రాజేష్ ఖన్నా, ఆశా వర్కర్  నాగమణి తదితరులు పాల్గొన్నారు.