త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు?...
- ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి- రామ రాజేష్ కన్న
- 2030 స్టాఫ్ నర్స్ లా నోటిఫికేషన్ ?..
- 1280 ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్?..
- మిగతా పరామెడికల్ కోర్సులో కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు?..
- జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో 1,280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు విశ్వాసనీయ సమాచారం. 2,030 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి పదిరోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఈ నెలాఖ రుకల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుందనీ తెలిసింది. మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం లభించింది. కాగా, వైద్యశాఖలోని (స్టాఫ్ నర్సులు) నర్సింగ్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నిషీయన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు సెప్టెంబరులో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలండర్లోనే ప్రకటించి నా విషయం మనకు తెలిసిందే..
నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా
ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశవ వ్యాప్తంగా 17వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరినీ రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు