Sports & Games

Breaking News

బి ఆర్ టి యు ఆధ్వర్యంలో డి ఎం అండ్ హెచ్ ఓ ను కలిసిన ఆశా కార్యకర్తలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ ని ఆయన కార్యాలయంలో బి ఆర్ టి యు.    హెచ్ వన్ యూనియన్ H -1 ఆధ్వర్యంలో. జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ,జిల్లా బి ఆర్ టి యు కోశాధికారి  నెట్టెడి నగేష్, ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు     . డి . సరస్వతి  ఆశ కార్యకర్తలు కలవడం జరిగింది ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ కి ఆశా కార్యకర్తల సమస్యలపై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తమ సమస్యలను సంఘ నాయకులు డి ఎం హెచ్ ఓ కి వివరిస్తూ గతంలో ఆశా కార్యకర్తలకు లెప్రసీ సర్వే , పల్స్ పోలియో కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి రెండు సంవత్సరాలు అయినను ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బీసీజీ సర్వే చేయలేము బీసీజీ రిపోర్టులు బీసీజి రికార్డులను చేయలేము అని తెలియజేస్తున్నాము. సంబంధిత మెటీరియల్ ఇవ్వకుండా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ప్రస్తుతం సర్వే చేయలేము అని తెలియజేస్తున్నాము . ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల విధుల్లో లో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. జిపిఎస్ యాప్ ను రద్దు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా చాలామంది ఆశల ఆశా కార్యకర్తల వద్ద గతంలో ఇచ్చినటువంటి చరవానిలు (స్మార్ట్ ఫోన్) చెడిపోవడం జరిగింది వాటి స్థానంలో ఆశా కార్యకర్తలకు కొత్తగా చరవానిలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము  రోగుల నుంచి సేకరించినటువంటి కళ్యాణమనాలను (స్పూ టం శాంపుల్స్) సర్వేల టార్గెట్లను తొలగించాల్సిందిగా, సర్వే చేసినటువంటి డబ్బులు ఇప్పించాల్సిందిగా  , సబ్ సెంటర్ డ్యూటీలను చేయలేమని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల నాయకులు ఏ. శారద టి. పద్మ, స్వరూప, పద్మ సునీత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.