Sports & Games

Breaking News

క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

-ఆదిలాబాద్, జైనథ్(ఆరోగ్యజ్యోతి): పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజు గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గూడ సిరిసన్న గ్రామంలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వ్యాధి నిరోధక టీకాలను అన్నిటిని పరిశీలించారు. పిల్లలకు సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.  వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా వ్యాధి మీద ఒక్క టీకాలు ఇచ్చిన అనంతరం వారికి కార్డు అందజేయాలని తెలిపినారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రతి బుధ శనివారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ సాయి ప్రీతి, వైద్యాధికారి డాక్టర్ సుచల ఎల్డీ కంప్యూటర్ కె సచిన్ కుమార్, హెచ్ ఇ ఓ రామ్ రెడ్డి తోపాటు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.