రేపు హన్మకొండ కలెక్టరేట్ లో జాబ్ మేళా!
హన్మకొండ జిల్లా: సెప్టెంబర్ 26 హన్మకొండ కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాల యంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీలో పని చేసేందుకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ , వరంగల్, ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78933 94393 నంబర్‌ను సంప్రదించాలని కోరారు
