Sports & Games

Breaking News

జ‌ర్నలిస్టు అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో అక్రిడేష‌న్ కార్డుల గడువు ముగిసిపోతుంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తున్న‌ట్లు ఐఅండ్ పీఆర్ అధికారులు పేర్కొన్నారు. అక్టోబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు అక్రిడేష‌న్ల గ‌డువును పొడిగిస్తూ ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఆర్టీసీ సంస్థ‌కు అధికారులు తెలిపారు.