పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు
రాజోలి మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు 54మంది పారిశుధ్య కార్మికులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు . ఆరోగ్య పరమైన అన్నీ రకాల పరీక్షలు జరిపారు. రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు 3, పడమర గార్లపాడు 1, రాజోలి 31, తుమ్మిల్ల 6, పెద్ద తాండ్ర పాడ్ 8, ముండ్ల దీన్నే 5పారిశుధ్య కార్మికులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమ లో టిబి నోడల్ పర్సన్ జయప్రకాశ్,హెల్త్ సూపర్ వైజర్ హెలెన్, రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎం లు ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

