అదిలాబాద్ లో ఏరోడ్రం ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ ఎమ్మెల్యే
.అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎరోడ్రంలో ఎయిర్ ఫోర్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఎంపీ నగేష్ గారు విన్నవించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి తో కలిసి వినతిపత్రం అందజేశారు. రక్షణ శాఖకు చెందిన 369 ఎకరాల భూమి ఉందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మరో 1592 భూమిని గుర్తించిందన్నారు. గత ప్రభుత్వం భూమి సేకరణ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం కోరిన విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి తన శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి తన శాఖ అధికారులకు ఆదేశిస్తూ త్వరలో పూర్తి వివరాలు తెలపాలని ఆదేశించారు.