ఆసుపత్రిలో పనిచేస్తున్న సపోర్టింగ్ సిబ్బందికి కనీస వేతనాన్ని అమలు చేయాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 98480 25451
జాతీయ ఆరోగ్య మీషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం హాస్పటల్లోలో పనిచేస్తున్న ఆల్ సపోర్టింగ్ స్టాఫ్ కి కనీస వేతనం అమలు చేయాలి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ కనీస వేతనము అమలు చేయాలనీ, ఆల్ సపోర్ట్ స్టాప్ కి ప్రస్తుతం వేతనం 10000 రూపాయలు ఇస్తున్నారు. జీ.ఓ.60 ప్రకారం నెలకు 15వేల 600 చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే వేతనాలు పెంచి చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వనీ డిమాండ్ చేయడం జరిగింది. మరియు వీరందరికీ సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మరియు బేసిక్ పే అమలు చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సబిత, రామనాథం, సమ్మయ్య, వనమాల మరియు తదితరులు పాల్గొన్నారు.