రాహుల్ గాంధీ పై అనుచిత వాక్యాలు చేస్తే సహిం చం
.రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు సహించం
తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
.
ఉట్నూరు: లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ పై బీజేపీ నాయకులు, దాని మిత్ర పక్షాలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఉట్నూర్ మండలకేంద్రంలోని ఐబి చౌక్ లో సంజయ్ గైక్వాడ్ దిష్టి బొమ్మను దహనం చెయ్యడం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ , ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50% కన్నా రిజర్వేషన్ లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. అయితే వారు చేసిన వ్యాఖ్యలను ఇతర పార్టీ వాళ్ళు కావాలని తప్పుగా వక్రీకరించి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో రాహుల్ గాంధీ పై పెరుగుతున్న ఆదరణ ను తట్టుకోలేకపోతున్న బిజెపి నేతలు వరుసగా రాహుల్ గాంధీ పై బురదజల్లే వ్యాఖ్యలను చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, బిజెపి నేత తర్విందర్ సింగ్ మార్వా, మహారాష్ట్ర షిండే గ్రూప్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్, సింగిల్ విండో ఉట్నూర్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగ్బాల్ షేక్, మండల అధ్యక్షులు ఖయ్యూం, మాజీ సర్పంచులు ఆత్రం రాహుల్, కళావతి మహిళా నాయకురాలు రాధాబాయి, భాగ్యలక్ష్మి , కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.