Sports & Games

Breaking News

రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యచరణ ప్రణాళిక - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

.రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కొత్త  రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై ముఖ్య‌మంత్రి గారు స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.