Sports & Games

Breaking News

చిరంజీవి రికార్డ్..156 సినిమాలు..537 పాటలు..24000 స్టెప్పులు

.*156 సినిమాలు.. 537 పాట‌లు.. 24,000 స్టెప్పులు...
* *గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి!*

హైదరాబాద్:
* మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. 
* హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరంజీవికి అందచేసారు.
* డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచిన మెగాస్టార్... ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు.
* ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. 
* చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయాయి.