Sports & Games

Breaking News

రాథోడ్ జితేందర్ మరణం తీరని లోటు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాథోడ్ జితేందర్ మరణం తీరని లోటని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అశోక్ లు అన్నారు. సోమవారం నాడు రాథోడ్ జితేందర్ శ్రద్ధాంజలి సభను రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ముందుగా రాథోడ్ జితేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ రాథోడ్ జితేందర్ మరణం అందరికీ బాధాకరాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు ఆధ్యాపక బృందం తో పాటు మధు, ప్రవీణ్, ఉదయ్, అనిల్, రాహుల్, ఈశ్వర్, అరుణ్, జగదీష్ తోపాటు జూనియర్లు సిరాజ్, నితిన్, గణేష్, పర్దిన్, సాయికుమార్, సిద్ధార్థ, నిరంజన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.