ధర్నా చేస్తున్న వైద్య ఉద్యోగులను అక్రమ అరెస్టు చేయడం అన్యాయం
హైదరాబాదులోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందు వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాను పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము.
----------------------------------------
వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు,వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు,హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు,104 ఉద్యోగులు,డీఎంఈ,వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ,శానిటేషన్, పేషెంట్ కేర్ఉద్యోగులు, నేషనల్ హెల్త్ మిషన్ లోని అన్ని క్యాడర్ల ఉద్యోగులు,టి సాక్స్ ఉద్యోగులు,ఆర్ ఎన్ టి సి పి ఉద్యోగులు,టి హబ్ ఉద్యోగులు,స్టాఫ్ నర్సులు,ఆయుష్ ఉద్యోగులు,అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగులు,హార్మోన్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలను మరియు వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులను యధావిధిగా రెగ్యులర్ చేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తేదీ:01-08-2024 గురువారం రోజున ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని కోఠిలో గల కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో "ధర్నా" చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా అరెస్టులు చేయించి,వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్న వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని,కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేస్తూ కనీస వేతనాలు, చట్టబద్ధహక్కులు కల్పించకుండ,రెగ్యులర్ చేయకుండ శ్రమ దోపిడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని యధావిధిగా పర్మినెంట్ చేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని,పని భారం తగ్గించాలని,టార్గెట్స్ అచ్యుమెంట్ పేరిట ఒత్తిడి తగ్గించాలని,బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,లేనియెడల రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖలోని మొత్తం ఉద్యోగులను సమీకరించి మరింత ఉదృతంగా దశలవారి ఆందోళన పోరాటాలు, అవసరమైతే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్,రాష్ట్ర కోశాధికారి ఏ.కవిత రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బలరాం,విజయ వర్ధన్ రాజు,కిరణ్మయి,నవీన్ కుమార్,సుధాకర్,శ్రీనివాస్, కుమారస్వామి,రాజేశ్వరి, లక్ష్మి,రాధిక,విజయలక్ష్మి,సరోజ,మంజుల,దీన,సుగుణ,నేహా తదితరులు పాల్గొన్నారు.