Sports & Games

Breaking News

104 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

104 ఉద్యోగుల ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి):గత ప్రభుత్వం 2021 సం॥ నవంబర్ 104 ఎఫ్ఎహెచ్ఎస్ సేవలను రద్దు చేసింద నీ వాటిని మళ్లీ యధా విధంగా ప్రారంభించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. 2008 సం॥ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు ఆగిపోయాయి. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో పనిచేస్తున్న సుమారు 1,350 మంది ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమయింది. 104 ఎఫ్ఎహెచ్ఎస్ సేవలను పునః పరిశీలన చేయాలని కోరుతున్నాము.104 ఎఫ్ఎహెచ్ఎస్ సేవలు అందించిన వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించే 300 ఓసిఎస్ హెడ్ కింద వేతనాలు చెల్లించాలి. రాబోయే పిఆర్సిలో రెగ్యులర్ ఎంప్లాయిస్ యొక్క కనీస బేసిక్ను వీరికి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలోకామిసినర్ ను కలిసిన వారిలో 
తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి s నవీన్ కుమార్ 104 ఉద్యోగులు సుభాష్,శేఖర్,ప్రకాష్,శ్రీనివాస్ 
తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్స్ :

1. 104 ఎఫ్ఎహెచ్ఎస్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించుటలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి.

2 104 ఎఫ్ఎహెచ్ఎస్ ఉద్యోగులకు "సమాన పనికి సమాన వేతనం" చెల్లించాలి.

3. 104 ఎఫ్ హెచ్ఎస్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.

4. 104 ఏఎన్ ఎంలను రెండవ ఏఎన్ఎంలుగా గుర్తించి రెగ్యులర్ చేయాలి.

5. 104 ఎఫ్ హెచ్ఎస్ ఉద్యోగులకు వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం స్వంత జిల్లాలకు బదిలీ చేయాలి,

6. హెల్త్ కార్డు లేదా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.

7. 35 క్యాజువల్ లీవులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్నిరకాల సెలవులు అమలు చేయాలి.

8. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించాలి.