Sports & Games

Breaking News

ఆస్పత్రిలో చేస్తున్న కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి

- *మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ్మ డిమాండ్*

జోగులాంబ గద్వాల్,(ఆరోగ్య జ్యోతి):జీతాలు ఈఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తున్న కాంట్రాక్టర్ ను  తొలగించాలి DME,  సర్క్యులర్ ప్రకారం 70 మంది వర్కర్లకు గాను 50 మందితో పని సరిపెడుతున్న కాంట్రాక్టర్ యెక్క నిలువు దోపిడినీ అరికట్టాలి .జోగులాంబ గద్వాల జిల్లా హాస్పటల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేసెంట్ కెర్ వర్కర్స్ కు ఎలైన్ అనే కాంట్రాక్టు ఏజెన్సీ సక్రమంగా జీతాలు, ఈ ఎస్ ఐ, పి ఎఫ్ ఇవ్వకుండా కార్మికుల పొట్టకొడుతూ అన్యాయం చేస్తున్నారని  తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ ఆరోపించారు .గురువారం నాడు గద్వాల జిల్లా హాస్పిటల్ కార్మికుల యెక్క సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా వర్కర్ల పై కాంట్రాక్టర్ వారి యెక్క సూపర్ వైజర్ చేస్తున్న అన్యాయం పైన ఆగ్రహం వెలిబుచ్చారు,హాస్పటల్ లో 220బెడ్లకు 100 మంది వర్కర్స్ పనిచేయాల్సి ఉన్న 50 మందితోటే పని చేయిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ ప్రకారం 140 బెడ్లకు అనుమతి ఉన్నాకూడా ఇంకా 20మంది వర్కర్లను పెంచుకో కుండా అన్ని విధాలుగా ఉన్న వారితో వెట్టి చాకిరీ దోపిడి చేయిస్తూ వర్కర్ల పైన దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కాంట్రాక్టర్ ను తొలగించి డిస్టిక్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకారం 220 బెడ్లకు 100మంది వర్కర్లను పెట్టుకునేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిట్టనిలువునా వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇలాంటి కాంట్రాక్టర్లను భవిషత్ లో తీసుకోకుండా కార్మికులకు సరైన జీతాలు భద్రత కల్పించే కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు, జిల్లా హాస్పిటల్ కార్మికుల పెండింగ్ జీతాలు, వర్కర్ల తొలగింపు వంటి సమస్యల పై కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటస్వామి, కార్మిక నాయకుడు వెంకట్రామిరెడ్డి ,పర్ష, చామంతి, లక్ష్మణ్, మతిన్, భాష, వెంకటేశ్వరీ తదితరుల తోపాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెసెంట్ కేర్ వర్కర్స్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు..