Sports & Games

Breaking News

ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకోండి

జిల్లా ఆయుష్ నివారణ అధికారి డాక్టర్ ప్రీతల్ రాథోడ్ 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పూర్వీకుల నుండి భారతదేశంలో సంప్రదాయ వైద్యంగా పేరు పొందిన ఆయుష్ వైద్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా ఆయుష్ నివారణ అధికారి డాక్టర్ ప్రీతల్ రాథోడ్ ఆరోగ్య జ్యోతి తో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్కు సంబంధించిన వైద్యులు ఉన్నారని వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నట్టు ఆమె వివరించారు. అనధిగా వస్తున్న ఆయుష్ వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఆయుష్ వైద్య విభాగాలకు ఉందని తెలిపారు.అందుకు ప్రజలందరూ ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని గ్రామాలలో ఆయుర్వేద, యునాని, హోమియోపతి క్లినిక్లు ఉన్నాయని ఆమె వివరించారు. అంతేకాకుండా రిమ్స్ ఆవరణలోని ఆడిటోరియం వద్ద ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్యశాలలు కూడా ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు ఆయుష్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నో రకరకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లకు ఉందని రోగులు వైద్యుల వద్దకు వచ్చి చూయించుకొని ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందులను వాడాలని తెలిపారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాలను తగ్గించే శక్తి ఆయుష్ వైద్యానికి ఉందని వివరించారు. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో ఉన్న ఆయుష్ వైద్య విధానాల ను ప్రజలకు తెలియజేయడం కోసం ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే గ్రామాల్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మహిళలు గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి ఆయుష్ వైద్యం ని ప్రచారం చేయడంతో పాటు రోగాల బారిన పడిన ప్రజలు శిబిరానికి వచ్చి వైద్య చికిత్సలు పొందాలని తెలిపారు.